CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దివ్యాంగులను అక్కున చేర్చుకున్నారు.. వారి సమస్యను తెలుసుకుని తక్షణమే వారికి సాయం అందేలా చేశారు.. కావలి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. దివ్యాంగులను చూసి చలించిపోయారు.. తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న వికలాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకుని, వారి సమస్యలను తెలుసుకున్నారు.. ఏడుగురు దివ్యాంగులు ముఖ్యమంత్రికి తమ ఆవేదన వెలుబుచ్చుకున్నారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణసాయంగా లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే…