మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతకు లంచం ఇవ్వజూపినందుకు, ఆమెను బెదిరించినందుకు అరెస్టయిన అనిక్ష జైసింఘానిని ముంబైలోని కోర్టు శుక్రవారం నాడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆమె పోలీసు రిమాండ్ పొడిగించాలన్న పోలీసుల విజ్ఞప్తిని తిరస్కరించింది.