మేషం : స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. బంధు మిత్రుల రాకపోకల వల్ల గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది. ఆలయ సందర్శనాలలో స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమంకాదని గమనించండి. వృషభం : ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి అధికారులతో మాటపడక తప్పదు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాల్చుతుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు…