ఈ తరం వారికి దర్శకుడు శరత్ అంతగా తెలియకపోవచ్చు. కానీ శరత్ తెరకెక్కించిన సూపర్ హిట్స్ పేరు వింటే ఆయనా ఈ సినిమాలకు దర్శకుడు అని ఆశ్చర్యపోతారు. బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు వంటి సూపర్ హిట్స్ తీశారు. సుమన్‌తో బావ-బావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు వంటి విజయవంతమైన సినిమాలు రూపొందించారు. మహానటుడు ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు, నటశేఖర కృష్ణతో సూపర్ మొగుడు లాంటి చిత్రాలు తీశారు. శరత్ మరణవార్త ఆయనతో పనిచేసిన వారికి దిగ్భ్రాంతి కలిగించింది.…