దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి భారీ లాభాల్లో పరుగులు పెట్టింది. ఇక సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు దేశీయ మార్కెట్లకు దన్నుగా నిలిచియాయి. దీంతో ఆరంభ ట్రేడింగ్‌లోనే రెండు ప్రధాన సూచీలు రికార్డు గరిష్ఠాలను తాకాయి.
కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ కొలువుదీరాక స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సూచీలు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ వారం అయితే మరింత దూకుడుగా ట్రేడ్ అయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి తాజా రికార్డ్ సొంతం చేసుకున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించాయి. ఇలా నిఫ్టీ అయితే ఆల్ రికార్డ్ సొంతం చేసుకుంది. 23, 560 మార్కును క్రాస్ చేసింది.
మొత్తానికి భారీ నష్టాల్లోంచి దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లోకి వచ్చాయి. బుధవారం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ముగింపు వరకు యధావిధిగా కొనసాగాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.