Today (26-12-22) Stock Market Roundup: గతవారం మొత్తం వెంటాడిన కొవిడ్ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం లాభాలతో మొదలై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్‌పై ఏమాత్రం పడకపోవటం గమనించాల్సి విషయం. రెండు సూచీలు కూడా బెంచ్ మార్క్‌కు పైనే ట్రేడ్ అవటం ఈ రోజు చెప్పుకోదగ్గ అంశం.