ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యులకు శుభవార్త చెప్పింది… మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, పీజీలకు, రెసిడెంట్ స్పెషలిస్టులకు గౌరవ వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ వైద్యారోగ్యశాఖ… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం… సీనియర్ రెసిడెంట్ వైద్యులకు రూ. 70 వేలు , రెసిడెంట్ డెంటిస్టులకు రూ. 65 వేలు, రెసిడెంట్ సూపర్ స్పెషలిస్టులకు రూ. 85 వేల మేర వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది……
కరోనా సమయంలో వైద్యులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణయం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.. ఇక, జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం పరిశీలిస్తోందని, చర్చిస్తోందన్నారు.. ప్రస్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు…