నెలకొక సారి అయినా ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాళ్లు స్వంత ఊర్లకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వెనుకబడ్డ వారి సమస్యలు అడిగి తెలుసుకోండని.. స్ఫూర్తి కలిగించండన్నారు. "లీడర్ అంటే లీడ్ చేసే వాడు. కానీ గృహ ప్రవేశాలు అంటూ దావత్ లు చేసుకుంటున్నామని బయటకు చెప్తున్నారు. దీపావళికి అందరూ చుచ్చుబుడ్డిలు వెలిగిస్తే.. కొంతమంది సారా బుడ్డిలు ఓపెన్ చేస్తూ... ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డ్రగ్స్ తీసుకునే నిబంధనలు అతిక్రమిస్తుంటే... వాళ్ళనీ ప్రోత్సహిస్తున్నారు..