తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తాజాగా మరో విభిన్న చిత్రాన్ని ప్రకటించింది. ‘విట్ నెస్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బహుభాషా చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ బహుభాషా చిత్రానికి సంబంధించి మే డే శుభాకాంక్షలు తో విడుదల చేసిన ‘విట్ నెస్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ఏదో విపత్కర పరిస్థితిలో…