(జూన్ 8న నటుడు గిరిబాబు పుట్టినరోజు)గిరిబాబులోని నటుడు నవ్వించాడు, కవ్వించాడు, ఏడ్పించాడు అన్నిటినీ మించి పలుచిత్రాలలో విలన్ గా భయపెట్టాడు. నవతరం చిత్రాలలో తాతయ్యగా, అంకుల్ గా అలరిస్తున్న గిరిబాబు ఆరంభంలో హీరో వేషాలు వేయాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. ప్రకాశం జిల్లా రావినూతలలో జన్మించిన గిరిబాబుకు ఎలాగైనా వెండితెరపై కనిపించాలనే అభిలాష ఉండేది. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు వేస్తూ ఉండేవారు. మిత్రులు ఏదో ఒకరోజున వెండితెరపై వెలిగిపోతావని ఆయనను ప్రోత్సహించారు.…