నటుడు సీవీఎల్ నరసింహారావు మా అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.. నామినేషన్ విత్ డ్రా చేసుకున్నాక సీవీఎల్ తన మద్దతును మంచు ప్యానెల్ కు తెలిపాడు. అంతేకాదు, ప్రకాష్ రాజ్ ప్యానల్ పై సంచలన కామెంట్స్ చేశారు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ ఎన్నికల్లో తెలంగాణా బిడ్డలను గెలిపించాలని సీవీఎల్ కోరారు. విష్ణు ప్యానెల్ లో వున్న బాబు మోహన్, ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో వున్న ఉత్తేజ్ నీ గెలిపించండి.…
ప్రముఖ నటుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నారు. కళాకారులకు ప్రాంతీయ సరిహద్దులు ఉండవని, వారిని లోకల్ – నాన్ లోకల్ గా చూడటం తప్పని ఇప్పటికే ప్రకాశ్ రాజ్ వర్గం చెబుతుండగా, సీవీఎల్ నరసింహారావు మాత్రం తన ఎన్నికల నినాదం ‘తెలంగాణ వాదం’ అని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా తెలంగాణా కళాకారులు ఇబ్బంది పడుతున్నారని, అలానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్న, పేద, మధ్య…