2024లో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) సేల్స్ భారీగా జరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఓలా సెగ్మెంట్‌లో నంబర్-1గా కొనసాగుతోంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ రిటైల్ విక్రయాల సంఖ్య 4 లక్షల యూనిట్లను దాటింది.