DilRaju: దిల్ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ అయినవే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు.
'రౌడీ బాయ్స్'తో హీరోగా పరిచయం అయిన శిరీష్ తనయుడు ఆశిష్ ఇప్పుడు 'సెల్ఫిష్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియో మే 1న ఆశిష్ బర్త్ డే సందర్భంగా విడుదల కాబోతోంది.
Selfish: రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.