టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. ఆటో మొబైల్ ఇండస్ట్రీలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీని అందిపుచ్చుకుని డ్రైవర్ లెస్ కార్లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంయుక్తంగా భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు నమూనాను ఆవిష్కరించాయి. దీనికి WIRIN (Wipro-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్) అని పేరు పెట్టారు. ఈ కారు పూర్తిగా భారత్ లో అభివృద్ధి చేయబడిన టెక్నాలజీపై…