ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు.…
తెలంగాణలో వరి వేయవద్దని ప్రత్నామ్నాయ పంటలు వేయాలని స్వయంగా కేసీఆర్, మంత్రులు పదే పదే చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతూనే వున్నారు. అయితే రైతులు మాత్రం చాలా చోట్ల వరి వైపే మొగ్గు చూపుతున్నారు. వరిపంట వేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశం అవుతోంది. ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం ప్రకటన చేసింది తప్ప ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహనా కల్పించడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.…
శాసనసభలో వరద నష్టంపై ప్రకటన చేశారు వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకూ 34 మంది మృతి చెందారని తెలిపారు మంత్రి కన్నబాబుజ అలాగే… మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటన చేశారు. భారీ వర్షాల కారణంగా 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వరదలతో 5.33 లక్షల రైతులకు నష్టపోయారని వెల్లడించారు. నెల్లూరు, చిత్తూరు,కడప 10 కోట్ల రూపాయలు, అనంతపురం కలెక్టర్ల వద్ద…