ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు అడవుల్లో ఉండే ముత్యంధార జలపాతం సందర్శనకు వెళ్లి 84 మంది పైగా పర్యాటకులు చిక్కుకున్నారు. పర్యాటకులు తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దారిలో ఉన్న వాగు పొంగింది. దీంతో వాగు దాటలేక అడవిలోనే ఉండిపోయారు పర్యాటకులు. వారిని కాపాడేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు.