ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ (55).. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన.. 1993లో ఇంగ్లాండ్ తరుఫున అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. 100 టెస్టులు, 82 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో గ్రాహం థోర్ప్ 16 సెంచరీలు సాధించాడు. అలాగే 6744 పరుగులు చేశాడు..
జమ్మూ కాశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉగ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. ఉగ్రవాదులు ఆర్మీ సిబ్బందిపై దాడి చేసి దాక్కుంటున్న తీరు..స్థానికులపై అనుమానాన్ని రేకిత్తిస్తోంది.
ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నట్లు అందరూ భావించారు. కానీ.. ఉగ్రవాదులు ఇప్పుడు జమ్మూని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. జమ్మూ ప్రాంతంలో నెల వ్యవధిలో జరిగిన ఐదు పెద్ద ఉగ్ర దాడులు ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది.
దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా చినిగామ్లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు.
ఉత్తర కాశ్మీర్ బారాముల్లా జిల్లా ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉరీ సెక్టార్లోని ఎల్ఓసి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా దళాలు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 200 కిలోమీటర్ల దూరంలోని గువా పోలీస్ స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతానికి సమీపంలో ఉదయం 5 గంటలకు ఎన్కౌ
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో కాల్పులు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్లో ఈరోజు ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని నిహామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి పోలీసులకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.