Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో…
Missile Attack : ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. గురువారం తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో పంజాబ్‌లోని అమృతసర్ సరిహద్దు జిల్లాలో భీకర శబ్దాలు, ఆకాశంలో వెలుగులు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అనంతరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఉదయం జెతువాల్, మఖన్ విండి, పాంధేర్ శివారు ప్రాంతాల్లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. Miss World 2025 :…
హైదరాబాద్‌లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరించాయి. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉన్నారు.
Bomb Blast: ఆగి ఉన్న మూడు బస్సులలో వరుస పేలుళ్లు సంభవించడంతో సెంట్రల్ ఇజ్రాయెల్ దద్దరిల్లింది. ఇది ఉగ్రవాద దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరూ గాయపడినట్లు, మరణించినట్లుగాను నివేదిక లేదు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ గాజా నుండి నలుగురు బందీల మృతదేహాలను తిరిగి ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని…
Eaknath Shinde : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు హత్య బెదిరింపు కేసు వెలుగులోకి వచ్చింది. గోరేగావ్ పోలీసులకు ఒక తెలియని వ్యక్తి నుండి ఒక ఇమెయిల్ వచ్చింది.
Fake Employee: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ సీసీసీ (కంప్రెహెన్సివ్ కోఆర్డినేషన్ సెంటర్) కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తి మూడు సార్లు రాకపోకలు నిర్వహించడం పోలీసులను అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ అనుమానాస్పద వ్యక్తి అక్కడ తిరుగడం హాట్‌టాపిక్‌గా మారింది. సీసీసీ కేంద్రంలో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తిని గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. మొదట అతను టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ ప్రచారం చేసుకున్నా, చివరకు ఆ ఫేక్ ఉద్యోగి జ్ఞాన…
Mumbai Airport: ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్మగ్లర్ పొట్టలో క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టినట్లు గుర్తించారు. ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన ఈ కేటుగాడిని, ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారులు స్మగ్లర్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స…
ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాస ఎయిర్ కు చెందిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
ప్రముఖ వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఈ బ్రౌజర్‌ని లక్షలాది మంది ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారంతా పెను ప్రమాదంలో పడ్డారు. భారత ప్రభుత్వ భద్రతా సంస్థ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) వారి కోసం ఒక ముఖ్యమైన భద్రతా హెచ్చరికను జారీ చేసింది. క్రోమ్ వెబ్ బ్రౌజర్ యొక్క పాత వెర్షన్ లను ఉపయోగించే వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఎందుకంటే., ఈ పాత వర్షన్…