సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు.. అనంతరం రఘురామకు వైద్య పరీక్షలపై ఓ ప్రకటన విడుదల చేశారు.. ముగ్గురు డాక్టర్ల బృందంతో రఘురామ కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించామని.. హైకోర్టు నామినేట్ చేసిన జ్యుడీషియల్ ఆఫీసర్ సమక్షంలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందనీ.. పరీక్షలు మొత్తాన్ని వీడియో తీశామని పేర్కొన్నారు.. ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు మెడికల్ కేర్‌లో ఉన్నారని తెలిపిన ఆర్మీ ఆస్పత్రి……
గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌కు తరలిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి బయల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయనను ఎప్పుడు తరలిస్తారని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక, రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్పష్టం…