తాను లౌకికవ్యక్తినని.. కానీ ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ అన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం (21-11-2025) గవాయ్‌ది చివరి పని దినం.
హోసబాలే వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని "ఎప్పుడూ" అంగీకరించలేదని ఆరోపించారు. అలాగే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూతో సహా దాని వ్యవస్థాపక పితామహులపై దాడులు చేస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ను విమర్శించారు.
RSS leader: రాజ్యాంగ పీఠిక నుంచి ‘‘సోషలిస్ట్’’, ‘‘సెక్యులర్’’ పదాలను తొలగించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గురువారం డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం అత్యవసర పరిస్థితిని విధించినందుకు కాంగ్రెస్‌ని విమర్శించారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు.
Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు బలపడుతున్నారు. జమాతే ఇస్లామీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వంటి కట్టర్ ఇస్లాం మద్దతుదారుల చేతిలో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులు అణిచివేతకు, దౌర్జన్యానికి గురవుతున్నారు. ఇన్నాళ్లు బంగ్లాదేశ్ సెక్యులర్ దేశంగా ఉండేది, అయితే ఇకపై పాకిస్తాన్‌లాగే ఇస్లామిక్ రాజ్యంగా మారే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.