ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా. పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్…