ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు జైస్వాల్ (53) రుతురాజ్ (58) అర్ధసెంచరీలు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇషాన్ కిషన్ (52) కూడా హాఫ్ సెంచరీ చేశాడు.