రేపటి నుంచి రెండో విడత రుణ మాఫీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు.. సిద్దిపేటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్నాం.. మహనీయుల స్ఫూర్తి, మహాత్ముడి అహింసా మార్గం, ప్రజాస్వామ్య పద్ధతిలో మహోద్యమాన్ని నిర్మించి తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నాం అన్నారు. ఏ ఆశయ సాఫల్యం కోసం స్వరాష్ట్రాన్ని కోరుకున్నమో ఆ లక్ష్యసాధన…