మార్చి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల అవుతుండటంతో సహజంగానే ఆ రోజున రావాల్సిన ఇతర చిత్రాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. శర్వానంద్ మూవీ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ను మార్చి 4న విడుదల చేయబోతున్నట్టు శనివారం ప్రకటించారు. అలానే ఇప్పుడు కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పీసీ 524’ విడుదల సైతం మార్చి 4వ తేదీకి వాయిదా పడినట్టు నిర్మాతలు కొత్త పోస్టర్ తో తెలిపారు. విశేషం ఏమంటే… ‘గని’ నిర్మాతలు మాత్రం విడుదల తేదీపై పెదవి విప్పడం లేదు.…
‘రాజావారు రాణి గారు’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం గత ఏడాది ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’తో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. దాంతో నాలుగైదు సినిమాలలో అతనికి హీరోగా నటించే ఛాన్స్ దక్కింది. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం ఇప్పుడు కిరణ్ అబ్బవరంతో సినిమాలు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం నటించిన మూడో చిత్రం ‘సెబాస్టియన్ పి.సి. 524’ విడుదల తేదీని నిర్మాతలు ప్రమోద్, రాజు మంగళవారం ప్రకటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ…