కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం గడువు తీరిన వాహనాలను తుక్కుగా మార్చేస్తారు. ఇలా స్క్రాప్‌ను తిరిగి వినియోగించే విధంగా మార్చేస్తుంటారు. గడువు తీరిన వాహనాలు బయట రోడ్లపై తిరుగుతుండటం వలన కాలుష్యం పెరుగుతుంది. ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే కేంద్రం ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల పరిమితి ఉంటే, వాణిజ్యవాహనాలకు పదేళ్ల పరిమితి ఉంటుంది. అయితే, పదేళ్ల తరువాత మరోసారి వీటికి ఫిట్నెస్ టెస్ట్…