కజకిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కావడం లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీనికి హాజరవుతారు. ఇక్కడకు వచ్చే ప్రపంచ నాయకులను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కలవనున్నారు.