S Jaishankar: భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్‌లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.