విద్యాసంస్థల రీ- ఓపెనింగ్‌పై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు కోవిడ్ ని దృష్టి లో పెట్టుకొని ఏర్పాట్లు చేశామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్ ను దృష్టి లో పెట్టుకునే ప్రత్యక్ష తరగతుల ప్రారంభం చేస్తున్నామని.. ఆఫ్ లైన్ బోధనకు ఆన్లైన్ ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. పిల్లలు ఆనందం తో ఉన్నారు.. తల్లి దండ్రులు కూడా పిల్లల్ని పంపేందు కు సుముఖంగా…
కరోనా కారణంగా ఏడాదిన్నరగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆ మధ్యలో తెరుచుకున్నా వైరస్ మళ్లీ విజృంభించడంతో మరొసారి విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఏపీలో స్కూళ్లు పునప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.కరోనా కష్టాలు, సవాళ్లు అన్నింటినీ అధిగమించి.. పాఠశాలల ప్రారంభానికి రెడీ అయింది ప్రభుత్వం. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు.. తరగతుల నిర్వహణపై…
విద్యా సంస్థల ప్రత్యక్ష తరగతులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కొన్ని రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులకు సమాయత్తం అవుతున్నాయి. ఒకటి రెండు రాష్ట్రాల్లో పాక్షికంగా ప్రారంభమయ్యాయి కూడా. ఈ పరిస్ధితుల్లో… తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులపై దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.గత రెండేళ్లుగా విద్యార్థులు తరగతి గది బోధనకు దూరం అయ్యారు. పాఠశాల విద్యార్థులయితే పరీక్షలు కూడా లేకుండానే పై తరగతులకు వెళ్లారు. డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నా.. ఎంత వరకు బుర్రకు ఎక్కుతున్నాయో…
కరోనా కారణంగా ప్రస్తుతం ఏపీలో స్కూళ్లు బంద్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి స్కూళ్లను రీ-ఓపెన్ చేయనుంది ఏపీ ప్రభుత్వం. అందువల్ల 16వ తేదీ నాటికి మొదటి విడత నాడు-నేడు పనులు పూర్తి చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాడు-నేడు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షితున్నారు విద్యా శాఖ ఉన్నతాధికారులు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా జరుగుతున్నాయి నాడు-నేడు పనులు.ఆధునికీకరణతో ప్రభుత్వ స్కూళ్లకు న్యూ లుక్ రానుంది.…
కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు అన్నీ మూతపడ్డాయి… అయితే, కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుంటూ.. క్రమంగా కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి స్కూళ్లను తెరిచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.. అందులో భాగంగా.. ఎల్లుండి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది పంజాబ్ ప్రభుత్వం.. ఆగస్టు 2వ తేదీ నుంచి పాఠశాలల తెరవాలంటూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది పంజాబ్ సర్కార్..…
ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయని.. తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. జగనన్న విద్యాదీవెనపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆగస్టు 16న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని.. ఉపాధ్యాయులకు ఆగస్టు 16లోగా 100శాతం బూస్టర్ డోస్ తో పాటు పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్టు వెల్లడించారు. ఇక, విద్యాకానుక రెండవ సారి అన్ని స్కూళ్ళలో అందించేందుకు…
కరోనా మహమ్మారి కారణంగా స్కూళ్లతో పాటు విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. క్లాసులు ఆన్‌లైన్‌లోనే.. ఇక పరీక్షల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఎందుకంటే.. పోటీ పరీక్షలు మినహా.. బోర్డు ఎగ్జామ్‌లతో పాటు అన్నీ రద్దు చేశారు. అయితే, కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. స్కూళ్లను పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆగస్టు 16వ తేదీ నుంచి స్కూల్స్ రీఓపెనింగ్‌కు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి..…