విద్యారంగంలో నాడు- నేడు, విద్యాకానుకలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలన్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై…
టీచర్ల ప్రమోషన్స్, బదిలీ లు, పాఠశాలల పునః ప్రారంభం పై సీఎంతో మాట్లాడాము అని తెలిపారు పిఆర్టియూ నేతలు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు. స్కూల్స్ ,జూనియర్ కళాశాలల ప్రత్యక్ష తరగతులు తాత్కాలిక వాయిదాకు సీఎం హామీ ఇచ్చారు అన్నారు. గతంలో మాదిరిగానే స్కూల్స్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు జరుగుతాయని… పరిస్థితిలు చక్కబట్టాకే ప్రత్యక్ష తరగతులు ఉంటాయని తెలిపారు. ఇక 50 శాతం టీచర్ల తోనే పాఠశాలలు ప్రారంభమవుతాయని… కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు,…