తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు..…