Viral Video: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. రెండు రోజులు పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, సౌదీ ప్రభుత్వం ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికింది.