పల్నాడు జిల్లా సత్తెనపల్లి విషాదం నెలకొంది. అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటిర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే.. కెనాల్‌లో దిగిన వీరు కొట్టుకుపోతుండటంతో స్థానికులు చూసి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్‌లో కొట్టుకుపోయారు.
Chandrababu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి ఇవాళ ( మంగళవారం ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయి ఫణీంద్ర చికిత్స కోసం తగిన సాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం అందించారు.
పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు.