రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. పవన్ గురించి పరోక్షంగా ట్వీట్ చేశారు. 'చే గువేరా జన్మదిన సందర్బంగా ఒక ప్రశ్న.. టీ షర్ట్ మీద చే గువేరా.. గుండెల్లో చంద్రబాబు.. ఎవరతను?' అని అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.