టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి నటిస్తున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి.. భీమిలి కబడ్డీ జట్టు, శివ మనసులో శృతి వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వం వహించనున్నాడు. లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా (డిసెంబర్ 15, ఆదివారం) ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.…