దసరాలో కీలక పాత్రలో నటించిన దీక్షిత్ శెట్టి, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల హీరోలుగా యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కె.జె.క్యూ – కింగ్, జాకీ, క్వీన్’. నాగార్జున కేడీ డైరెక్టర్ కె.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. 1990ల నేపథ్యంలో పీరియాడికల్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తొలి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు…