తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ బదిలీ అయ్యారు. శశాంక్ గోయల్‌ను కేంద్ర సర్వీసులకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న శశాంక్ గోయల్.. కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు. గతంలో శశాంక్ గోయల్ కార్మిక, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలు అందించారు. అంతేకాకుండా…