Viral Photo: సాధారణంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆటోలు, బస్సులు, రైళ్లలో వెళ్తూ పుస్తకాలు తీసి తెగ చదివేస్తుంటారు. ఏడాది మొత్తం చదవకపోయినా పరీక్షల ముందు మాత్రం విద్యార్థులు తెగ చదివేయాలని తపన పడుతుంటారు. అయితే రైల్వే ప్లాట్‌ఫారాలపై గుంపులుగా విద్యార్థులందరూ ఒకచోట చేరి చదువుకోవడం మాత్రం కనిపించదు. మహా అయితే ఒకరిద్దరు విద్యార్థులు మాత్రమే ఇలా కనిపిస్తారు. కానీ బీహార్ రాష్ట్రంలోని ససారం రైల్వేస్టేషన్‌లో మాత్రం ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది.…