హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని అందించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హుజురాబాద్ మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కాకతీయ కాలువ ద్వారా నీరు కొనసాగుతున్నప్పటికీ, డీబీఎం 16 ద్వారా హుజురాబాద్ రైతులకు నీరును అందించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ఇది అసహనానికి గురిచేస్తోందన్నారు. ఖమ్మం కోసం నీటిని…