వివాహేతర సంబంధానికి మరో భర్త బలయ్యాడు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఓ భార్య వేసిన స్కెచ్‌కు భర్త ఊపిరి ఆగిపోయింది. ప్రియుడితో కలిసి చంపేసి.. అనంతరం ‘భర్త పడుకుని ఇంకా లేవడం లేదని’ డ్రామా ఆడింది కిలాడి. కానీ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం మాదారానికి చెందిన జల్లెల శేఖర్.. రంగారెడ్డి జిల్లా వెల్దండ మండలం…