కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.