వచ్చే సంక్రాంతి బరిలో పోటీపడబోతున్న పందెం కోళ్ళ విషయంలో నిదానంగా క్లారిటీ వస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ యేడాది విడుదల కావాల్సిన ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రం వచ్చే యేడాది జనవరి 13న విడుదల కావాల్సింది. కానీ ఎప్పుడైతే రాజమౌళి తన మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ను ఈ యేడాది చివరిలో కాకుండా, వచ్చే జనవరి 26న కాకుండా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీ వరల్డ్ వైడ్…