విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భారత జట్టు ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ చెలరేగాడు. జైపుర్ వేదికగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతున్న 28 ఏళ్ల సర్ఫరాజ్.. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. 209.33 స్ట్రైక్ రేట్‌తో ఆడిన సర్ఫరాజ్ 56 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో శతకం సాధించాడు. సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ (60)…