సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకుంటున్నారు. గతంతో పోలిస్తే నాణ్యమైన చీరలు ఇవ్వాలని మంత్రికి అంగన్వాడి టీచర్లు విజ్ఞప్తి చేశారు.