విలక్షణమైన పాత్రల్లో, వైవిధ్యమైన అభినయంతో ఆకట్టుకుంటూ సాగారు శరత్ బాబు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లోనూ శరత్ బాబు అభినయం అలరించింది. తెలుగులో కన్నా తమిళనాట శరత్ బాబుకు మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో ఓ అతిథి పాత్రలో కనిపించా