ఆంధ్ర రాష్ర్టానికి శ్రీవేంకటేశ్వర స్వామే ఆస్తి అన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. శ్రీవారి అనుగ్రహం లేకుండా తిరుమలలో ఏ కార్యక్రమం జరగదన్నారు. శ్రీవారిని సాక్షాత్కారం చేసుకున్న అన్నమయ్య,పురంధరదాసు,తరిగోండ వెంగమాంబ అంజనాద్రియ్యే తిరుమల అని చెప్పారు. వీరు చెప్పిన తరువాత కూడా ప్రామాణితలు కావాలని కోరడం సమంజసమా? రామజన్మ భూమిని నిర్దేశించిన చిత్రకూట్ పీఠాధిపతులు రామభద్రాచార్యుల వారు కూడా అంజనాద్రియ్యే హనుమంతుడి జన్మస్థలంగా నిర్దేశించారు. మరోవైపు హనుమంతుడి జన్మస్థలం నిర్దారణ కోసం కమిటీని ఏర్పాటు చేసాం…
ఏపీ సీఎం జగన్ విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. చిన ముషిడివాడలోని శారదాపీఠం నిర్వహిస్తున్న వార్షికోత్సవాలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం కోసం ముఖ్యమంత్రితో పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అమ్మవారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత జగన్ చేతుల మీదుగా కలశ స్థాపన చేయించారు. రాజశ్యామల యాగంలో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణమ్మ పాల్గొన్నారు. స్వామివారు జగన్ ని ఆశీర్వదించారు.