ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి వైసీపీ ఖాతాలో చేరింది. ఎంపీటీసీల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీకి మెజారిటీ ఉన్నా తాజా పరిణామాలతో పరిస్థితి తారుమారైంది. ఈ మేరకు దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూపారాణి ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని అధికారులు ప్రకటించారు. దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా… ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో ఎవరూ లేరు.…