కోరుట్ల పట్టణంలో సోమవారం గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిదుబ్బ ప్రాంతంలో తమ ఇంటి డాబాపై ఇద్దరు చిన్నారులు తోకల సాత్విక్, ప్రశాంత్ గాలిపటం ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే దారం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. తీగలలోని దారాన్ని తీసేందుకు ప్రయత్నించగా, బాలురు విద్యుత్ వైరుకు తగిలి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి…