Prabhas New Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన సాహో, రాధేశ్యామ్ ఘోర పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు ఆయనతో పాటు తన అభిమానులు కూడా రాబోతున్న సినిమా పై ఆశలన్నీ పెట్టుకున్నారు.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్త.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ ప్రస్తుతం.. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. పవర్ స్టార్ రాబిన్ హుడ్…
ఏపీలో మద్యం అమ్మకాల సమయం పెంచడంపై విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. సమయాన్ని పెంపుదల చేయడంపై బీజేపీ ఆక్షేపిస్తోంది.కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగు సంస్కృతిని దెబ్బ తీసేందుకే వైసిపి కంకణం కట్టుకుంది.గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారమే తెలుగు సంస్క్రుతిని దెబ్బ తీసే చర్యల్లో భాగమే అన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. క్యాసినోల నిర్వహణ అనేది వైసిపి ప్రభుత్వ పరోక్ష నిర్ణయంలా ఉందనడానికి ప్రత్యేక రుజువులు…
21 ఏళ్ళ క్రితం వచ్చిన లగాన్ సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ సినిమాను గుర్తుచేశారు ఆదిలాబాద్ అన్నదాతలు. సంక్రాంతి సందర్భంగా పంచెకట్టులో క్రికెట్ ఆడారు అన్నదాతలు. దీంతో ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయింది స్టేడియం. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రానికి చెందిన రైతులు క్రికెట్ ఆడారు. బోథ్ లోని లాల్ పిచ్ మైదానంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో మండల కేంద్రానికి చెందిన రైతులంతా…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా RRR రిలీజ్ పోస్ట్ పోన్ పై హీరో రామ్ చరణ్ స్పందించారు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న రాంచరణ్ ఆర్.ఆర్.ఆర్ విడుదలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి మాకు ఎంత ముఖ్యమో మాకు తెలియదు కానీ…
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి.…
కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించారు. రెండవ ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయిలో వాహనాల అనుమతి ప్రారంభించింది టీటీడీ. జెండా ఊపి వాహనాలను అనుమతించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. రెండవ ఘాట్ రోడ్డు ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వర్షాల వల్ల ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 1వ తేదిన 16వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో…