హైదరాబాద్‌లో కూడా సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ భోగి పండుగ కావడంతో.. నగరంలో భోగి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి మంటల చుట్టూ యువతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా భోగిని ఆశ్వాదిస్తున్నారు.
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహా ఇచ్చారు.
సంక్రాంతి సమయంలో ప్రత్యేక బస్సులు నడుపుతూ అదనపు ఛార్జీలు వసూలు చేయడం చూస్తూ వచ్చాం.. ఆర్టీసీకి కూడా దీనికి మినహాయింపు ఏమీకాదు.. ఇక, ప్రైవేట్ ట్రావెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే.. పండుగలను క్యాష్ చేసుకునే పనిలో భాగంగా.. అదనంగా బాదేస్తూనే ఉన్నారు.. అయితే, సంక్రాంతి సమయ�