తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 5 ఏళ్ల రాతి యుగపాలనకు ముగింపు పలికి.. స్వర్ణయుగానికి నాంది పలికేలా సంక్రాంతి సంకల్పం తీసుకోవాలని ఆయన అన్నారు. చేయి చేయి కలిపి స్వర్ణయుగం వైపు పయనిద్దామన్నారు.
Sankranti Wishes: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాజకీయ నేతలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి స్ఫూర్తితో యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగగా మారిన రోజున భారతదేశం సంపూర్ణంగా విప్లవాత్మకంగా మారుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని రైతులకు, ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు. పొలాల్లోని ధాన్యాలు తమ…
సంక్రాంతి సందర్భంగా రాజ్ భవన్‌లో మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై దంపతులు, బంధువులు, రాజ్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో రాజ్ భవన్‌లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పొంగల్ తయారు చేశారు. అనంతరం గవర్నర్ తమిళసై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తూ పండుగ జరుపుకుందామని ఆమె పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలు…
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఆయన సంక్రాంతి పండగ ప్రాముఖ్యతను వివరించారు. మనదైన అచ్చ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు, వ్యవసాయానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, తెలుగువారికంటూ ఉన్న ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని సీఎం జగన్ అన్నారు. Read Also: పచ్చమందకు పైత్యం బాగా ముదిరింది: విజయసాయిరెడ్డి భోగి మంటలు, రంగ…